Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులను మెప్పించి భూములు తీసుకోవాలి
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్ రాములు
నవతెలంగాణ- వీపనగండ్ల
సింగోటం గోపాల్దిన్నె రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు ఎకరాకు రూ.40 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్ రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లాలో సింగోటం గోపాల్దిన్నె రిజర్వాయర్ లింకు కాల్వలో భూములు కోల్పోతున్న కొర్లకుంట, వల్లభాపురం, బొల్లారం, వల్లభాపురం తండ, సంగినేనిపల్లి కల్వరాల గ్రామాల భూనిర్వాసితులతో కలిసి వీపనగండ్ల మండల పరిధిలోని సంగినేనిపల్లి గ్రామంలో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.వెంకట్రాములు మాట్లాడుతూ.. రిజర్వాయర్ కాల్వలో 6 గ్రామాల్లో సుమారు 400 మంది రైతులు 400 ఎకరాల భూములు కోల్పోయారని తెలిపారు. రైతులకు ప్రభుత్వం మార్కెట్ ధరకనుగుణంగా ఎకరాకు రూ.40 లక్షలు చెల్లించాలన్నారు. గ్రామ సభలు నిర్వహించి గ్రామపంచాయతీ ఆమోదంతో రైతులను మెప్పించి భూములు తీసుకొని కాల్వ తొవ్వాలి గానీ, అధికార యంత్రాంగం, పోలీసులు బల ప్రయోగంతో భూములు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎకరాకు ఐదు లక్షలు చెల్లిస్తామని చెప్పడం దారుణమన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు మూడింతల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో మామిడి తోటలు, వేరుశనగ, వరి పంటలకు భూములు సారవంతమైనవని చెప్పారు. ఇప్పటికే కొంతమంది రైతులు కాలువలో భూములు కోల్పోయి నష్టపోయారని గుర్తుచేశారు. ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని నిర్వాసితుల సమస్యలు కూడా పరిష్కరించాలని కోరారు. నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టంలో ఉన్న విధంగా అమలు చేయా లని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల ఆంజనేయులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బాల్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం సంఘం జిల్లా అధ్య క్షులు ఇంద్రకంటి వెంకటేష్, సర్పంచులు మౌలాలి, నారాయణ, రైతు సంఘం మండల అధ్యక్షులు కష్ణయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు దేవన్న మండల అధ్యక్షులు కార్యదర్శులు కృష్ణయ్య, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.