Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యఖర్చులతో సతమతమవుతున్న పేదలు
- నిధుల కొరతతో నిలిచిపోయిన భవనాలు
- సిబ్బంది కొరత
- పని గంటల కుదింపు
- కేంద్ర బడ్జెట్లో ప్రజారోగ్యానికి అరకొర నిధులే
కరోనా ప్రపంచానికి గుణపాఠం నేర్పింది. ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు పడకలు, వైద్య, నర్సింగ్ సిబ్బందిని అందుబాటులో ఉంచకపోతే మహమ్మారులను ఎదుర్కోవడం ఎంత ఇబ్బందిగా మారుతుందో కోవిడ్ తెలిపింది. ప్రజారోగ్యానికి తమ బడ్జెట్లో సముచిత కేటాయింపులు చేసే దేశాలు కోవిడ్‌కు తట్టుకుని నిలబడితే ఆ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన దేశాలు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యాయి.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా ప్రపంచానికి గుణపాఠం నేర్పింది. ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు పడకలు, వైద్య, నర్సింగ్ సిబ్బం దిని అందుబాటులో ఉంచకపోతే మహమ్మారులను ఎదుర్కోవడం ఎంత ఇబ్బందిగా మారుతుందో కోవిడ్ తెలిపింది. ప్రజా రోగ్యానికి తమ బడ్జెట్లో సముచిత కేటాయింపులు చేసే దేశాలు కోవిడ్‌కు తట్టుకుని నిలబడితే ఆ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన దేశాలు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యాయి. ప్రజా రోగ్యానికి బడ్జెట్లో కనీసం ఆరు శాతం నిధులు కేటాయిం చాలనే డిమాండ్ పాతదే అయినప్పటికీ కరోనా తర్వాత ఆ డిమాండ్ మరింతగా మారు మోగుతోంది. ఇందుకు సంబంధించి డాక్టర్లు, నర్సులు, మేధావులు, నిపుణుల నుంచి అనేక సూచనలు వస్తున్నాయి. వాటి అమలుకు కేంద్రం బడ్జెట్లో తగినంతగా నిధులు కేటాయించాల్సి ఉన్నది. కేంద్రంలోని బీజేపీ సర్కారు చివరి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ రంగానికి చెందిన నిపుణులు, ఐఎంఏ తదితర సంఘాల నుంచి పలు సల హాలు వస్తున్నాయి.
బడ్జెట్లో 2025 నాటికి జీడీపీలో 2.5శాతం కేటాయిం చేలా ప్రతి ఏడాది పెంచుకుంటూ వెళ్తామని మోడీ సర్కార్ 2017లో ఆరోగ్య విధానాన్ని రూపొందించింది. ఆ మేరకు నిధులు పెరగకపోగా గతేడాది నాటికి కేటాయిం పులు 1.1శాతం వద్దే ఆగిపోయాయి. ఆరోగ్య రంగానికి రూ.89 వేల కోట్లు కేటాయించగా, ఇందులో రూ.83 వేల కోట్లు రెవెన్యూ ఖర్చులు కాగా రూ.5,630 కోట్లు క్యాపిటల్ ఖర్చులుగా విభజించారు. ప్రతి ఏడాది 99,063 మంది ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని బయటికి వస్తుండగా, అదే స్థాయిలో నర్సింగ్, పారామెడికల్ కోర్సులను పూర్తి చేసేందుకు అవకాశాలు లేకపోవడం గమనార్హం. ప్రతి 15 వేల మందికి 24 గంటలు పని చేసే ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అవసరముండగా, ఇప్పటికీ 30 వేల మందికి ఒక పీహెచ్సీ, అదీ కూడా కొన్ని గంటలు మాత్రమే పని చేసేలా ఉన్నాయి. మరిన్ని ఫస్ట్ రెఫరల్ యూనిట్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరమున్నది. భవనాల మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కింద రూ.64,180 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించినప్పటికీ, గత రెండేండ్లలో కేవలం రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. 2022లో జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ.37 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, నివారణ, చికిత్స కోసం ఈ నిధులను పెంచాల్సిన అవసర మున్నది. మానవ వనరుల అభివృద్ధికి రూ.7,500 కేటా యించడంతో, ఇప్పటికీ అర్హత, తగిన శిక్షణ పొందిన ఆరోగ్యసంరక్షణ సిబ్బంది చాలినంత మంది లేక కొరతను ఎదుర్కొంటున్నారు.
జీఎస్టీని తొలగించాలి
ఆరోగ్యరంగ సేవలపై జీఎస్టీ వేయడాన్ని ఉపసంహరిం చుకోవాలని నిపుణులు కోరుతున్నారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల్లో చేసే చికిత్సల రేట్లు తక్కువగా ఉంటున్నాయనీ, వాటిపైనా జీఎస్టీ విధిస్తుండటం తగదని సూచిస్తున్నారు. ఇతర చికిత్సలు, వైద్య సదుపాయాలు, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్కు వేసే పన్నులు పరోక్షంగా ప్రజల వైద్యఖర్చులను పెంచుతున్నాయి. వారి జేబులకు చిల్లులు పెడుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడే క్రమంలో దేశవ్యాప్తంగా 2,000 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా కుటుంబాలకు ఇప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం అందలేదు. వీరి కోసం ప్రత్యేక నిధి ఏర్పాటుకు ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో నిర్ణయం తీసుకుంటారని ప్రజలు ఆశిస్తున్నారు. వృద్ధుల కోసం ప్రత్యేక క్లినిక్ లు, ఇంటి వద్ద సేవలందించడం తదితరమైన వాటిపైనా దష్టి సారించాల్సిన అవసరముంది. వలస కార్మికుల ఆరోగ్య పరిస్థితి మిగిలిన వారితో పోలిస్తే దుర్భరంగా ఉంటుండడంతో వారి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉన్నది.
క్లినిక్‌లను కాపాడుకోవాలి
దేశంలో ఇప్పటికీ 44 శాతం మంది ప్రజలు ప్రయివేటు డాక్టర్లు, క్లినిక్‌లు, నర్సింగ్ హౌంలకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నారని ఐఎంఏ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ శరద్ కుమార్ అగర్వాల్, డాక్టర్ అనిల్ కుమార్ జె.నాయక్ తెలిపారు. ప్రభుత్వరంగానికి, కార్పొరేట్ కు మధ్యస్తంగా ఉండే వీరి సేవలను ప్రోత్సహించాలని వారు కోరారు. తక్కువ ఖర్చుతో ప్రజారోగ్య పరిరక్షణలో సొంత క్లినిక్‌లు, నర్సింగ్ హౌంలు నడుపుతున్న డాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రానికి ఇబ్బందులు ...
సరైన సిబ్బంది, సౌకర్యాలు లేక రోగులకు ఆదరణ కరువు
రాష్ట్రానికి మెడికల్ కాలేజీలనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కోరుతున్నప్పటికీ కేంద్రం నుంచి గ్రీన్ సిగల్ రావడం లేదు. ఒకే సారి దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలకు అనుమతించిన సమయం లోనూ తెలంగాణకు మొండిచేయి చూపిం చింది. సకాలంలో ప్రతిపాదనలు పంపించడంలో రాష్ట్ర సర్కారు విఫలమైందని కేంద్రం సమర్థించుకున్న ప్పటికీ చివరి బడ్జెట్ లో ప్రతిపాదనల మేరకు సహకరిస్తుందా? లేదా? అనేది చూడాలి. బీబీనగర్‌లో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఏర్పాటు చేసినప్పటికీ సరైన సిబ్బంది, సౌకర్యాలు లేపోవడంతో రోగుల ఆదరణ పొందలేకపోతున్నది. ఇక్కడ ప్రాక్టికల్స్ నిర్వహించాల్సిన వైద్య విద్యార్థులు సైతం వాటి కోసం ఇతర ఆస్పత్రులకు వెళ్లున్నారు. కనీసం చివరి బడ్జ్టె లోనైనా సరే తగినన్ని నిధులు కేటాయించాలని నిపుణులు కోరుతున్నారు.