Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ల కమీషన్ల కోసమే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్
- ఎన్ఎమ్ఓపీఎస్ జాతీయ కార్యదర్శి స్థితప్రజ్ఞ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గౌతమ్ ఆదానీ వాణిజ్య గ్రూప్‌పై అమెరికా హెడ్జ్ ఫండ్ హిడెన్ బర్గ్ వెల్లడించిన నివేదికలో ఎల్ఐసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రుణాలలో సీపీఎస్ ఉద్యోగుల డబ్బులే 67శాతం ఉన్నాయని పేర్కొనటం ఆందోళన కలిగిస్తున్నదని ఎన్ఎమ్ఓపీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ అన్నారు. అదానీ అప్పు సీపీఎస్ ఉద్యోగులకు ముప్పుగా పరిగణించిందని వాపోయారు. డబ్బులున్నాయని కార్పొరేట్ల లాభం కోసం సీపీఎస్ ఉద్యోగుల సొమ్మును వాడుకోవటం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన ఉండి పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని నేషనల్ మూమెంట్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. పాత పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కూరకుల శ్రీనివాస్, మ్యాన పవన్ కుమార్, లింగ మూర్తి,దర్శన్ గౌడ్,రోషన్, మల్లికార్జున్ పాల్గొన్నారు.