Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో నెంబర్17ను రద్దు చేయాలి
- నేడు కలెక్టరేట్ల ముందు ధర్నాలు
- ఎన్పీఆర్డీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగులకు రాష్ట్ర బడ్జెట్లో ఐదు శాతం నిధులు కేటాయించాలనీ, ఆసరా పెన్షన్ల మంజూరుకు ఆదాయపరిమితి విధించే జీవో నెంబర్ 17ను రద్దు చేయాలని కోరుతూ నేడు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నా లను చేపట్టినట్టు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె వెంకట్, ఎం అడివయ్య ఆదివారం ఒక ప్రకట నలో తెలిపారు. స్వయం ఉపాధి కోసం వేలాదిమంది నిరుద్యోగులు దరఖా స్తులు చేసుకున్నారనీ, 25 శాతం మందికి కూడా రుణాల మంజూరు చేయలే దని పేర్కొన్నారు. వికలాంగుల వివాహ ప్రోత్సాహం కోసం గతేడాది 711 మంది దరఖాస్తు చేసుకుంటే 240 మందికి మాత్రమే మంజూరు చేశారని గుర్తుచేశారు. బ్యాటరీ వీల్ చైర్ల కోసం రెండు వేల మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. 2022 ఆర్థిక సంవత్సరం ముగుస్తు న్నప్పటికీ దరఖాస్తు చేసుకున్న వారందరికీ పరికరాలు పంపిణీ చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయించి, స్వయం ఉపాధి రుణాలు, పరికరాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.