Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీలకు జీరో సర్వీసును అనుమతించాలని, దొడ్డి దారిన జరుగుతున్న సెక్రటేరియట్ బదిలీలను వెంటనే ఆపివేయాలని యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ రాష్ట్ర బాధ్యులు ఏ.వెంకట్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూఎస్పీసీ ఆధ్వర్యంలో ఆదివారం విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టు కేసులు లేని స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, పీడీ పోస్టులను అర్హత గల ఉపాధ్యాయులతో భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీ కౌన్సెలింగ్కు ముందు జీరో సర్వీసు కలిగిన ఉపాధ్యాయులందరినీ బదిలీకి అనుమతిం చాలన్నారు. 317 జీఓ ద్వారా సుదూర ప్రాంతంలో పనిచేస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నటు వంటి ఉపాధ్యాయులను బదిలీలకు అను మతించినట్టయితే వారికి ఎంతో కొంత ఉపశమనం కలుగుతుందని తెలిపారు. జిల్లాలో జరుగుతున్న పదోన్నతులు, బదిలీల జాబితా తయారీలో పారదర్శకత పాటించాలని కోరారు. ఒకవేళ అక్రమాలు జరుగుతున్నట్లయితే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్య క్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు స్వామి, అశోక్, శ్రీనివాస్, వృకోధర్, రామేశ్వర్, సుగుణ, జాదవ్ శ్రీనివాస్, లక్ష్మణ్, కిష్టన్న శంకర్, విలాస్, సేవాసింగ్, ఉదరి నారాయణ, ప్రేమల, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.