Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ టూరిజం చైర్మెన్ ఉప్పల శ్రీనివాస గుప్తా
నవతెలంగాణ-హైదరాబాద్
దేశ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో కీలక పాత్ర పోషించే భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి అంతర్జాతీయంగా ఆర్య వైశ్యులు మద్దతు ఇవ్వాలని ఐబీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పిలుపునిచ్చారు. ఆదివారం తమిళనాడులోని చెన్నైలో కాస్మోపాలిటన్ క్లబ్, అన్నశాల ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ తమిళనాడు విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నూతన పారిశ్రామిక విధానం టీఎస్ పాస్‌ను అందరూ అభినందిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వశాఖల్లో పారదర్శకత పెరిగిందన్నారు. బీఆర్ఎస్కు ఆర్యవైశ్యులు మద్దతుగా నిలిచి తమిళనాడులో కూడా గెలిపించుకుంటే అవన్నీ ఇక్కడా అమలవుతాయని, ఆర్యవైశ్యులకు సముచిత స్థానం లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కస్తూరి రంగరాజన్, కె శంకర్రావు, అధ్యక్షులు పి శేషాద్రి, కార్యదర్శి, ట్రెజరర్ తదితరులు పాల్గొన్నారు.