Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్ మెట్
317 జీవోను సవరించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద 317 జీవో బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మహా ధర్నా నిర్వహిం చారు. ఈ ధర్నాలో ఉపాధ్యాయ సంఘాల నేతలు మారిశెట్టి తిరుపతిరావు, సదానంద గౌడ్, భుజంగరావు, నాగేశ్వరరావు, వినోద్‌లు హాజరై మాట్లాడారు. ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు చేపడుతున్న తరుణంలో స్థాని కత కోల్పోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు స్థానికత కల్పించాలని డిమాండ్ చేశారు. సంవత్సరం నుంచి తాము పోరాటం చేస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడం లేదన్నారు. సీఎం తమ మీద ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్య లకు పాల్పడుతునారని ప్రశ్నించారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని.. స్థానికత ఆధారంగా తమను ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నామని తెలిపారు. భార్యాభర్తల్ని విడదీయకుండా ఒకే దగ్గర ఉండే విధంగా బదిలీ చేయాలన్నారు. జీవో 317 వల్ల తాము 200, 300 కిలోమీటర్ల ప్రయాణం చేసి పిల్లలకు విద్యా బోధించగలమా అని ఆవేదన వ్యక్తం చేశారు. చదివింది ఎక్కడో ఉద్యోగం అక్కడే కల్పించాలని కోరారు. 317 జీవోను సవరించి ఉపాధ్యాయులకు న్యాయం చేయకపోతే ఫిబ్రవరి 3 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు.