Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్‌ను ఖరారు చేసే యోచన
- ఇంజనీర్ల బృందంతో కలిసి ఎన్వీఎస్ రెడ్డి
- మెట్రో అలైన్మెంట్ పరిశీలన
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎయిర్పోర్ట్ మెట్రో విస్తరణ పనులు శర వేగంగా సాగుతున్నాయి. ఈ మెట్రో నిర్మాణ పనుల కోసం సంబంధిత అధికారులు ఇప్పటికే స్థల సేక రణపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రయివేటు ఆస్తుల సేకరణ సాధ్యమ య్యేనంత మేర తగ్గించేలా.. ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్‌ను ఖరారు చేయాలని అధికారులు భావి స్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం హైదరా బాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్(హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సీనియర్ ఇంజనీర్ల బృందంతో కలిసి మెట్రో అలైన్‌మెంట్‌ను, స్టేషన్ స్థానాల ఎంపికను పరిశీలించారు. నార్సింగి అండర్‌పాస్ (మై హౌమ్ అవతార్ జంక్షన్) నుంచి రాజేంద్రనగర్ గుట్ట వరకు దాదాపు 10 కిలోమీటర్లు నడిచి.. అలైన్‌మెంట్‌లోని ప్రతి అంశాన్ని క్షుణంగా పరిశీలించారు. అనంతరం హెచ్ఏఎంల్ ఎండీ అధికారులకు పలు మార్గదర్శకాలు, ఆదేశాలిచ్చారు. ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్‌ను ప్రయివేట్ ఆస్తుల సేకరణను నివారించే విధంగా లేదా సాంకేతికంగా సాధ్యమయ్యేంత వరకు తగ్గించే విధంగా ఖరారు చేయాలన్నారు. ప్రయాణీకులు స్టేషన్లకు సులువుగా చేరుకోవడానికి ఓఆర్ఆర్ అండర్‌పాస్‌లను ఉపయోగించేందుకు వీలుగా స్టేషన్లు నిర్మించాలని తెలిపారు. కారిడార్ పరిసరాల్లో నిర్మాణంలో ఉన్న ఎత్తైన వాణిజ్య, నివాస భవనాల వాసుల అవసరాలను తీర్చడానికి భవిష్యత్తులో అదనపు స్టేషన్ల నిర్మాణం కోసం గుర్తించబడిన ప్రదేశాల్లో మెట్రో వయాడక్ట్ ప్లాన్ చేయాలన్నారు. స్కైవాక్‌లు, ఇతర పాదచారుల సౌకర్యాలు స్టేషన్ ప్లానింగ్‌లో అంతరాÄ్భగంగా ఉండాలని చెప్పారు. మెట్రో పిల్లర్లు నానక్‌రామ్‌గూడ జంక్షన్ నుంచి టీఎస్పీఏ(అప్పా) జంక్షన్ వరకు విస్తరించిన సర్వీస్ రోడ్డు సెంట్రల్ మీడియన్‌లో ఉండాలని, ఇది సర్వీస్ రోడ్డులో ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్న రహదారి ట్రాఫిక్ సజావుగా సాగేలా చేస్తుందని చెప్పారు. స్టేషన్ల యాక్సెస్ పాయింట్లు కొత్త సైకిల్ ట్రాక్‌కు అను గుణంగా ఉండాలని, పర్యావరణహితంగా స్టేషన్లను చేరుకోవడానికి ఈ కొత్త సైకిల్ ట్రాక్ ఉపయోగ పడుతుందిన సూచించారు. ఎయిర్‌పోర్టు మెట్రో ప్రయాణం మరింత వేగవంతం చేయడానికి, సజావుగా సాగేలా చేయడానికి కొన్ని ప్రదేశాల్లో వంపులు లేకుండా సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. స్టేషన్ల కోసం పార్కింగ్ సౌకర్యాల అభివృద్ధి, ప్రాజెక్ట్ వేగవంతం చేయడానికి తాత్కాలిక కాస్టింగ్ యార్డుల ఏర్పాటు కోసం కారిడార్ సమీపంలో తగిన బహిరంగ ప్రభుత్వ భూములను గుర్తించాలని అధికారులను ఆదేశిం చారు. పరిశీలనా బృందంలో.. హెచ్ఏఎంఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి.ఆనంద్ మోహన్, జనరల్ మేనేజర్లు ఎం. విష్ణువర్ధన్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్ నాయక్, ఎస్ఈ వై.సాయపు రెడ్డి, డీఎస్పీ కె.శ్రీనాథ్ రెడ్డి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.