Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాల్సాఫ్ట్తో ఒప్పందం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ నిర్వహణకు టెక్నాలజీని అనుసంధానం చేస్తూ ఆర్టీసీలో కార్యకలాపాలను నిర్వహించనున్నట్టు టీఎస ్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. సంస్థ లో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్(ఈఆర్పీ) అమలు కోసం సోమవారం 'నాల్‌సాఫ్ట్' సంస్థ సీఈవో సీఏ వెంకట నల్లూ రితో ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ఈఆర్పీ సాధ్యం కోసం 9 నెలల్లో అన్ని విభా గాల్లోనూ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేలా ఒప్పందం జరిగిందని తెలిపారు. అంతర్గత సామర్థ్యం పెంచుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుందన్నారు. డిపోలు, జోన్లతో పాటు హె డ్ ఆఫీస్‌లోని ఫైనాన్స్, హెచ్ఆర్, ఇంజనీరింగ్ తదితర విభాగాలను ఈఆర్పీ ఏకీకతం చేస్తుందని వివరించారు. 2023 టీఎస్ఆర్టీసీకి ఐటీ సంవత్సరం అని తెలిపారు. నాల్‌సాఫ్ట్ సీఈవో సీఏ వెంకట నల్లూరి మాట్లా డుతూ ఈ ప్రాజెక్టులో ఆపరేషన్లను కేంద్రీకతం చేయడం, మార్గాలను క్రమబద్దీకరించడం, ఇంధన నిర్వహణ, వ్యక్తి గత, స్టోర్లు, వర్క్‌షాప్‌లు, సమర్థవంత ఆదాయ నిర్వ హణ తదితర విషయాలపై దృష్టి పెడతామ న్నారు. దీనికి ఉద్యోగులం తా సహకరించాలని కోరారు. కార్య క్రమంలో టీఎస్ఆర్టీసీ ఎగ్జి క్యూటివ్ డైరె క్టర్లు ముని శే ఖర్, వినోద్ కుమార్, చీఫ్మేనే జర్ (ఎఫ్ అండ్ ఎ) విజయ పుష్ప, సి.ఒ (ఐటీ) రాజశేఖర్, నల్సాష్ట్ ప్రతి నిధులు అనిరుద్ధ్, అఖిల్, వికాస్, హరి ప్రసన్న, శివరామ కష్ణ పాల్గొన్నారు.