Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జాతిపిత మహాత్మా గాంధీ హత్య ఉదంతంపై వాస్తవాలు నేటి తరానికి తెలియాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మహాత్మా గాంధీ 75వ వర్ధంతి సందర్భంగా మంత్రుల నివాస ప్రాంగణంలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన గాంధీజీకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీజీ హంతకుడు నాథూరాం గాడ్సేను పొగుడుతూ బీజేపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ, వాస్తవ చరిత్రను వక్రీకరిస్తున్నదని అన్నారు. ఇలాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వాస్తవాలు వెల్లడి కాకుంటే చెప్పుకున్నోడిదే చరిత్ర అవు తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ హత్య తో మతోన్మాద ఉగ్రవాదానికి బీజం పడిందని అన్నారు. ఈ ఉన్మాదాన్ని యువత తుదముట్టించాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని 9 ఏండ్లు జైలు జీవితాన్ని అనుభవించిన జవహర్లాల్ నెహ్రూను కించపరుస్తూ బీజేపీి నాయకులు దుష్ప్రచారం చేస్తున్నా రన్నారు. స్వాతంత్య్రోద్యమంతోనే సంబంధం లేని బీజేపీ తామే గొప్ప దేశభక్తులమని చెప్పుకోవడం విచారకరమని చెప్పారు. కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి, భూదాన్ యజ్ఞ సంస్థ రాష్ట్ర నాయకులు యానాల ప్రభాకర్‌రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ అక్బర్ పాల్గొన్నారు.