Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 56,977 దరఖాస్తుల స్వీకరణ
- పరిశీలకుల నియామకం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసే గడువును ప్రభుత్వం వచ్చేనెల ఒకటో తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ)లు, జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈవో) ఉపాధ్యాయుల బదిలీల కోసం దరఖాస్తులను వచ్చేనెల ఒకటో తేదీ వరకుయ స్వీకరించాలని ఆదేశించారు. గతంలో దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులకు సవరణ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు వివరించారు. ఆర్జేడీలు, డీఈవోలు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకే పాఠశాలలో ఎనిమిదేండ్ల సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులు, ఐదేండ్లు పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం) తప్పనిసరిగా బదిలీ కానున్న విషయం తెలిసిందే. అయితే ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఉన్నతాధికారులను పరిశీలకులుగా నియమించామని తెలిపారు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్‌కు ఎం రాధారెడ్డి, హైదరాబాద్, మెదక్, సంగారెడ్డికి ఎ కృష్ణారావు, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ఖమ్మంకు సిహెచ్ రమణకుమార్, నిజామాబాద్, కామారెడ్డికి జి ఉషారాణి, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామకు ఎస్ విజయలక్ష్మి బాయి, ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం ఆసిఫాబాద్‌కు ఎస్ శ్రీనివాసాచారి, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాలకు పి రాజీవ్, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, కరీంనగర్‌కు ఎం సోమిరెడ్డి, ములుగు, భూపాలపల్లికి పి మదన్మోహన్, మహబూబ్‌నగర్, నారాయణపేటకు బి వెంకట నర్సమ్మ, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాలకు ఎ ఉషారాణిని నియమించామని వివరించారు.ఉపాధ్యాయ బదిలీల కోసం సోమవారం నాటికి 56,977 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.