Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రోజుకు పదివేల మంది కూలీలు తగ్గకుండా అన్ని జిల్లాల్లో ఉపాధి పనులకు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులు, అదనపు డీఆర్డీఓలతో ఆ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి పనులకు కూలీల హాజరుపై సమీక్షించారు.