Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ వైస్ ఎంపీపీ, సర్పంచ్, మాజీ సర్పంచ్, ఇతర సీనియర్ నాయకులు, యువజన నాయకులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం హైదరాబాద్లో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. సీఎం కేసీఆర్ విధానాలు నచ్చి పార్టీలో చేరుతున్నామనీ, దేశానికి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో గీసుకొండ వైస్ ఎంపీపీ రడం శ్రావ్య భరత్, రాంపూర్ సర్పంచ్ గాజర్ల గోపి, మచ్చాపూర్ మాజీ సర్పంచ్ నమిండ్ల మానస, సీనియర్ కాంగ్రెస్ నాయకులున్నారు.