Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రభుత్వం తమ భూమిని తీసుకుని నష్టపరిహారం చెల్లించడం లేదంటూ హైదరాబాద్లోని ప్రగతిభవన్ ముందు భార్యాభర్తలు ఆత్మహత్యయత్నం చేశారు. ఈ ఘటన కలకలం రేపింది. వివరాలిలా ఉన్నా యి.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ఐలేశ్ సోమవారం భార్యతో కలిసి ప్రగతిభవన్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఒక్కసారిగా ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. తమ భూమిని ప్రభుత్వం తీసుకుని నష్టపరిహారం చెల్లించడం లేదని ఐలేశ్ ఆరోపించారు.