Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి : ద.మ.రైల్వే జీఎమ్ అరుణ్‌కుమార్ జైన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సాధ్యమైన ప్రాంతాల్లో వేగ నిరోధకాలను తొలగించి, రైళ్ల వేగాన్ని పెంచాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఆరుణ్‌కుమార్ జైన్ అన్నారు. అదే సమయంలో అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. సోమవారంనాడిక్కడి రైల్ నిలయంలో వివిధ విభాగాల అధిపతులతో రైళ్ల రాకపోకలు-భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లకు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్లు (డీఆర్ఎంలు) వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎమ్ మాట్లాడుతూ సరుకు రవాణా, పర్యవేక్షణ, పని ప్రదేశాల్లో భద్రతా అవసరాలను తప్పకుండా పాటించేలా క్షేత్ర స్థాయి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లతో సహా భద్రతా సిబ్బందికి క్రమం తప్పకుండ శిక్షణ, కౌన్సెలింగ్ ఇవ్వాలని చెప్పారు. జోన్ పరిధిలో డబ్లింగ్, ట్రిపుల్ లైన్లు, విద్యుదీకరణ, స్టేషన్ పునరాభివద్ది పనుల పురోగతి, కోర్టు కేసులను సమీక్షించారు.