Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రచయిత పి.చంద్రశేఖర్ ఆజాద్
- 'ఎదురీత' బాలల కథలు ఆవిష్కరణ
నవతెలంగాణ-ముషీరాబాద్
బాల్యం ఒక ఎదురీతగా మారిపోయిందని సుప్రసిద్ధ కథా, నవలా రచయిత పి.చంద్రశేఖర్ ఆజాద్ అన్నారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అధ్యక్షతన జరిగిన సభలో ''ఎదురీత'' బాలల కథా సంకలనాన్ని చంద్రశేఖర్ ఆజాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల కథలంటే పెద్దలకు సంబంధం లేదనే భావన తప్పన్నారు. ఆనందాచారి మాట్లాడుతూ.. శాంతారావు రాసిన ఈ కథలు కేవలం పిల్లలకే కాదు, పెద్దలు కూడా చదవాల్సిన కథలన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చొక్కాపు వెంకటరమణ మాట్లాడుతూ.. శాంతారావు నిత్యం పిల్లలతో మమేకమయ్యారని, అందుకే ఇలాంటి కథలు రాయగలిగారన్నారు. పుస్తకాన్ని ప్రముఖ బాల సాహితీవేత్త వీఆర్ శర్మ పరిచయం చేశారు. ప్రముఖ బాలల హక్కుల కార్యకర్త పి.శ్యామల, తెలంగాణ సాహితి రాష్ట్ర నాయకులు తంగిరాల చక్రవర్తి, అనంతోజు మోహన్ కృష్ణ, సలీమ, హైదరాబాద్ నగర కమిటీ నాయకులు శరత్ సుదర్శి, రేఖ, రామకృష్ణ, చంద్రమౌళి, ముజాహిద్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఇన్చార్జి బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.