Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పులపాలై అన్నదాతల ఆత్మహత్యలు : చైతన్య సేద్యం డైరీ ఆవిష్కరణలో టి సాగర్ ఆవేదన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎరువులు, పురుగుమందుల, విత్తనాలు, వ్యవసాయ పరికరాల ధరలు పెరిగాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ పేర్కొన్నారు. పెట్టుబడి ఖర్చులు కూడ రాకపోవడంతో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సహకారం అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రూపొందించిన 'వ్యవసాయ మాసపత్రిక చైతన్యసేద్యం 2023' డైరీని సాగర్, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, సారంపల్లి మల్లారెడ్డి, చైతన్యసేద్యం ఎడిటర్ అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, డీివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడు తూ తొమ్మిదేండ్ల నుంచి చైతన్యసేద్యం డైరీలు రైతాంగానికి అందుబాటులో తెస్తున్నామన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని కార్పొ రేట్లకు దోచి పెడుతున్నదని విమర్శించారు. రైతాంగ పోరాటం వల్ల ప్రభుత్వం దిగివచ్చిన ఢిల్లీ ఉద్యమంలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడం దారుణమన్నారు. రైతులపై పెట్టిన కేసులు కూడా ఎత్తేయలేదని చెప్పారు. చనిపోయిన 750 మంది రైతు కుటుంబాలకు పరిహారం అందజే యాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యల నివారణకు స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయాలని కోరారు. రైతులకు ఆదాయం కోసం ఇన్‌ఫుట్ సబ్సిడీ, పంటల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో చైతన్యసేద్యం మాసపత్రికలో వచ్చే అంశాలు రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని వివరించారు.