Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీలో గాంధీ విగ్రహానికి స్పీకర్, మండలి చైర్మెన్ ఘన నివాళి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మహాత్మాగాంధీ మత సామరస్యం కోసం పోరాటం చేశారనీ, ఆయన్ను హత్య చేయడం నీచమైన చర్య అని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద మండలి చైర్మెన్‌తో కలిసి పోచారం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు గంగాధర్‌గౌడ్, ఫరూక్హుస్సేన్, బండ ప్రకాశ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి నరసింహాచార్యులు ఉన్నారు.