Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహాత్మగాంధీ వర్థంతిని పురస్కరించుకుని సోమవారం హదరాబాద్లోని బాపూఘాట్లో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వలసవాద బ్రిటిష్ పాలకుల నుంచి అహింస, సత్యాగ్రహల ద్వారా గాంధీనీ స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టారన్నారు. అనంతరం గవర్నర్ తో పాటు ఇతరులు అతిథులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.