Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలి : మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం
- జాతీయ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని, గ్రేటర్ వరంగల్ నగరంలో రూ.50 కోట్లతో ఆధునిక సౌకర్యాలతో చేపల మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని మత్స్యకారుల, కార్మికుల సంఘం (ఏఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యూఎఫ్) జాతీయ కార్యదర్శి లెల్లల బాలకృష్ణ అన్నారు. సోమవారం హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో తెలంగాణ మత్స్య కారులు, మత్స్య కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గొడుగు వెంకట్ అధ్యక్షతన నిర్వహించిన జిల్ల్లా సదస్సుకు ఆయన హాజరైన మాట్లాడారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రతి మత్స్య సొసైటీకి రూ.10 లక్షలు ఉచితంగా ఇవ్వాలన్నారు. 50 ఏండ్లు నిండిన మత్స్యకారుల కు రూ.5 వేల పింఛను ఇవ్వాలన్నారు. చెరువులు, కుంటలను కబ్జాలు, కాలుష్యం నుంచి రక్షించాలని కోరారు. శాటిలైట్ ద్వారా సర్వే చేయించి ఎఫ్టీఎల్ హద్దురాళ్ళు ఏర్పా టు చేసి, భూకబ్జాదారుల నుంచి రక్షించాలని తెలిపారు. ఉచిత చేెప పిల్లలకు బదులుగా నగదును బ్యాంక్ అకౌంట్ల లో జమ చేయాలని కోరారు.