Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాట్స్ చైర్మెన్‌కు డీవైఎఫ్ఐ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో క్రీడా రంగానికి అధిక నిధులు కేటాయించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మెన్ ఈడిగ ఆంజనేయులుగౌడ్‌ను సోమవారం డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండీ జావీద్ కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో అధిక నిధులు కేటాయించి గ్రామీణ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులను ప్రోత్సహించాలని సూచించారు. కేద్ర ప్రభుత్వం క్రీడాకారుల పట్ల కుల, మత, ప్రాంతం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. ఖేలో ఇండియా పేరుతో వేల కోట్ల రూపాయలు గుజరాత్, బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తూ, వేరే రాష్ట్రాలపైన వివక్ష చూపుతున్నదని పేర్కొన్నారు. రాష్టంలో యువతను ప్రోత్సహించి క్రీడాకారులుగా తయారు చేస్తామని ఆంజనేయులుగౌడ్ హామీ ఇచ్చారని తెలిపారు. అనంతరం డీవైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీమాన్, వేణు తదితరులు పాల్గొన్నారు.