Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెకానికల్ విభాగం ఉత్తమ ప్రదర్శన
హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో స్ట్రక్షరల్ ఇంజనీరింగ్, డిజైనింగ్ సేవల్లో ఉన్న మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సివిల్, మెకానికల్ విభాగాల ప్రధాన మద్దతుతో 452.5 శాతం వద్ధితో రూ.9.2 కోట్ల నికర లాభాలు సాధించింది. అంతక్రితం ఏడాది ఇదే క్యూ3లో రూ.1.67 కోట్ల లాభాలను నమోదు చేసింది. గడిచిన డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ టర్నోవర్ 71 శాతం అధికమై రూ.40.7 కోట్లుగా ఉంది. ఏప్రిల్-డిసెంబర్ కాలంలో రూ.104 కోట్ల టర్నోవర్‌తో రూ.19 కోట్ల నికరలాభం సాధించింది. సివిల్, మెకానికల్ విభాగాలు రెండూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచాయని మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ సిఎండి జె.లక్ష్మణ రావు తెలిపారు. 'మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన కంపెనీల మోడళ్లకు 3డి, 2డి, రోబోటిక్స్ సేవలను అందిస్తోంది. ఇటువంటి సర్వీసులను ఆఫర్ చేస్తున్న అతికొద్ది భారతీయ కంపెనీల్లో మోల్డ్‌టెక్ ఒకటి. యూరప్, ఉత్తర అమెరికాలోని ఆటోమొబైల్ కంపెనీలకు అనుభవం కలిగిన డిజైన్ హౌస్‌గా ఈ ప్రస్థానం సహాయకారిగా ఉంది. రాబోయే రోజుల్లో ఆటోమొబైల్ సంస్థల నుంచి డిజైన్ సేవల కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఉండబోతోంది. యూరప్, మెక్సికో నుంచి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇవిలపై ఇప్పుడు దష్టిసారించాం. అక్కడి మార్కెట్లో విస్తరణ కోసం కనెక్షన్ డిజైన్, స్ట్రక్చరల్ డిజైనింగ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ రంగ కంపెనీలను కొనుగోలు చేస్తాం. ఇవి కంపెనీలతో ఉన్న భాగస్వామ్యం మెకానికల్ విభాగం వద్ధికి దోహదం చేసింది. ఆర్డర్ బుక్ ఎన్నో రెట్లు పెరిగింది. రానున్న త్రైమాసికాల్లో ఈ వృద్థి కొనసాగుతుంది' అని లక్ష్మణ రావు ధీమా వ్యక్తం చేశారు.