Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధికారుల బృందం
నవతెలంగాణ -గజ్వేల్
నేషనల్ సెక్యూరిటీ అండ్ స్టేటస్టిక్ స్టడీస్ అంశంపై న్యూఢిల్లీకి చెందిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధికారులు సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ అభివృద్ధిని పరిశీలించారు. అంతకుముందు ఆ బృందం సభ్యులకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్వాగతం పలికారు. దగ్గరుండీ అభివృద్ధి పనులను వారికి వివరించారు. ఈ సందర్భంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధికారుల బృందం సభ్యులు మాట్లాడుతూ.. గజ్వేల్ అభివృద్ధి అబ్బురపరిచిందన్నారు. మహతి ఆడిటోరియం, సమీకృత మార్కెట్, ప్రభుత్వ ఆస్పత్రి, హెర్బల్ పార్క్, అర్బన్ పార్క్, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించడం, విద్యార్థుల కోసం అతిపెద్ద ఎడ్యుకేషన్ హబ్ నిర్మించడం గొప్ప విషయమని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను విద్యార్థినీ, విద్యార్థులకు వేరువేరుగా నిర్మించారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమైన గజ్వేల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికి దిక్చూచిగా నిలబడిందన్నారు. ముందస్తు ప్రణాళికతో వెళ్లడంతో ఇలాంటి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అనంతరం గజ్వేల్ సమీకత భవనంలో సమీక్షించారు. వారి వెంట గజ్వేల్ స్పెషల్ అధికారి ముత్యం రెడ్డి, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ మాదాసు శ్రీనివాస్ ఉన్నారు.