Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిల్లులు రావడం లేదని సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
అప్పులు తెచ్చి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టామని, వాటి బిల్లులు రాకపోవడంతో తీసుకొచ్చిన అప్పులకు మిత్తిలు కట్టలేకపోతున్నామని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట సోమవారం నందిపేట్ సర్పంచ్ సాంబారు వాణి ఆమె భర్తతో కలిసి పెట్రోల్పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అడ్డుకొని వారిని అధికారుల వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలో చేసిన అభివృద్ధి పనులు, పారిశుధ్య పనులకు ఎంబీ రికార్డులు చేసిన బిల్లులను ఉపసర్పంచ్ మాద రవి సంతకాలు చేయకుండా ఆపివేశారని ఆరోపించారు. బిల్లులపై సంతకాలు పెట్టకుండా వేధింపులకు గురి చేస్తు న్నాడని ఆరోపించారు. సుమారు కోటిన్నర రూపాయలు నందిపేట్ మండల అభివృద్ధికి వెచ్చించామని, బిల్లులు మంజూరు చేయడంలో సహ కరించడం లేదని సర్పంచ్ సాంబారు వాణి, తిరుపతి ఆరోపించారు. కోటి న్నరకు మిత్తితో కలిపి రూ.3 కోట్లకు పైగా అప్పు అయిందని, అప్పుల బాధ భరించలేక కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్య చేసుకుందామని వచ్చినట్టు తెలిపారు.