Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగిత్యాల
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ మున్సిపల్ చైర్పర్సన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన భోగ శ్రావణి రాజీనామాకు సోమవారం కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. అంతకు ముందు ఉదయమే రాజీనామా విషయంలో భోగ శ్రావణి నుంచి క్లారిటీ తీసుకున్న కలెక్టర్ రవి రాజీనామాను ఆమోదిస్తూ.. కొత్త చైర్మెన్ ఎన్నిక అయ్యే వరకు వైస్ చైర్మెన్‌గా ఉన్న గోలి శ్రీనివాస్‌కు తాత్కాలిక చైర్మెన్ బాధ్యతలు ఇస్తున్నట్టు అధికారక ఉత్తర్వులు జారీ చేశారు.