Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక ఆహ్వానం అంటూ ఏమీ లేదు
- రాజకీయ నాయకులు పరస్పర దూషణలకు ప్రాధాన్యం : చిన్న జీయర్ స్వామి
నవతెలంగాణ-శంషాబాద్
ఫిబ్రవరి రెండో తేదీ నుంచి 12వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని సమతా మూర్తి కేంద్రంలో త్రిదండి రామాను జాచార్యుల విగ్రహావిష్కరణ ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా సమతా కుంభ్ - 2023 ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని త్రిదండి చిన్న జీయర్ స్వామి తెలిపారు. ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న సమతా కుంభ్ -2023 కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను సోమవారం సమతా మూర్తి కేంద్రంలో ఆయన వివరించారు. సమతా కుంభ్ పది రోజులపాటు కొనసాగుతుందని, ఆగమన శాస్త్ర పద్ధతి ప్రకారం ఐదారు వేల మంది రుత్విక్లతో హౌమ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. 108 దివ్య దేశాల నిత్య హౌమాల కార్యక్రమానికి వచ్చే ప్రజలకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. ప్రథమ వార్షికోత్సవానికి ప్రత్యేకంగా ఎవర్ని ఆహ్వానించడం లేదని, అందరికీ సాధారణ ఇన్విటేషన్ పంపించినట్టు తెలిపారు. సామూహికంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక రాజకీయ పార్టీ ఒక్కొక్క సిద్ధాంతంతో ప్రజల ముందుకు వచ్చి పరిపాలన సాగించడం సాధారణంగా వస్తుందని చిన్న జీయర్ స్వామి అన్నారు. రాజకీయాలు చేయడమే పరిపాటుగా మారిన నాయకులు ఒకరిపై ఒకరు నిందలు, దూషణలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. దాంతో ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల అవసరం ఉన్న సమయంలో రాజకీ యాలు మాట్లాడి, ఆ తర్వాత అందరూ కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవడం కోసం పరస్పరం సహకరిం చుకోవడం వల్ల మంచి జరుగుతుందన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు ఆ విధంగా కానరావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.