Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆతిథ్యమిస్తున్న టీఎస్ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశవ్యాప్తంగా ఆర్టీసీలు ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కారాలను సూచిస్తూ ఫిబ్రవరి 5వ తేదీ హైదరాబాద్‌లో దేశవ్యాప్త ఆర్టీసీ సంఘాల నాయకుల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీలకు చెందిన దాదాపు 80 మంది ప్రతినిధులు హాజరయ్యే ఈ సమావేశానికి టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) ఆతిథ్యమిస్తున్నది. దీని నిర్వహణకు సంబంధించి రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘం అధ్యక్షులు వీరాంజనేయులు అధ్యక్షతన ఆన్లైన్ వేదికగా జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు సమావేశ ప్రాధాన్యతను వివరించారు. దానితోపాటు నిర్వహణకు అవసరమైన ఆర్థికసహకారాన్ని కూడా కోరారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, పెరుగుతున్న డీజిల్ ధరలతో దేశవ్యాప్తంగా ఆర్టీసీలు నిర్వీర్యం అవుతు న్నాయనీ, వాటి పరిరక్షణ కోసం భవిష్యత్ కార్యాచరణ నిర్ణ యించాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) పిలుపునిచ్చిందని తెలిపారు. దానిలో భాగంగా ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ అనుబంధ సంఘాల నాయ కుల సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జమ్మూ కాశ్మీర్ సహా దేశంలోని పలు రాష్ట్రాల ఆర్టీసీల నుంచి దాదాపు 80 మంది ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటారని చెప్పా రు. ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ అధ్యక్షులు నేపాల్‌దేవ్ భట్టాచార్య, ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య, ఎస్టీయూ సెక్టార్ కన్వీనర్ ఆర్ముగనాయనార్ హాజరవుతారని వివరించారు.