Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసే గడువు ప్రక్రియ బుధవారంతో ముగియనుంది. గతనెల 28 నుంచి వాటి కోసం ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం వరకు బదిలీల కోసం 63 వేల మంది దరఖాస్తు చేసినట్టు సమా చారం. బదిలీలకు సంబంధించిన ఉపాధ్యాయుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది.
ఈ ప్రక్రియ గురువారం వరకు కొనసాగుతుంది. బదిలీలకు దరఖాస్తు చేసేందుకు బుధవారం చివరి రోజు కావడంతో మరో పది వేల వరకు దరఖాస్తులొచ్చే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 40 వేల నుంచి 50 వేల వరకు ఉపాధ్యాయ బదిలీలు చేపట్టే అవకాశమున్నది. ఈ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా చేపట్టేందుకే విద్యాశాఖ సీనియర్ అధికారులను జిల్లాల వారీగా పరిశీలకులుగా నియమించిన సంగతి తెలిసిందే.