Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ మాతృమూర్తి కౌసల్య(93) అనారోగ్యంతో మరణించారు.గత నెల రోజులుగా ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కన్నుమూశారు. బుధవారం మధ్యాహ్నాం 12 గంటలకు కాసాని స్వగ్రామం కుత్భుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
చంద్రబాబు సంతాపం
కౌసల్య మరణం పట్ల ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్.చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌గౌడ్, పార్టీ సమన్వయకర్త కంభంపాటి రామ్మోహన్రావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కాసానికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంత్యక్రియలకు చంద్రబాబు హాజరు కానున్నారని ఆ పార్టీ నేతలు చెప్పారు.