Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమీక్షా సమావేశంలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో వచ్చే వేసవి నాటికి 15,500 మెగావాట్లకు మించి గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదయ్యే అవకాశం ఉన్నదని విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండేలా విద్యుత్ సంస్థలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే టీఎస్ఎస్పీడీసీఎల్లో 1,601 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. మంగళవారంనాడాయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది రబీ సీజన్లో 14,160 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైందనీ, అలాగే 2022 డిసెంబర్ 30వ తేదీ 14,017 మెగావాట్లుగా నమోదైందని చెప్పారు. కరెంట్ డిమాండ్ ఎంత పెరిగినా రాష్ట్రంలో నిరంతర సరఫరాతో, పంటలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పెరుగుతున్న పారిశ్రామిక అభివద్ధి, గహ వినియోగదారుల పెరుగుదల, వ్యవసాయ రంగానికి చేస్తున్న ఉచిత విద్యుత్ సరఫరా నేపథ్యంలో ఈసారి డిమాండ్ భారీగా పెరుగుతుందనే అంచనా ఉందన్నారు. అలాగే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థలో ఖాళీగా ఉన్న 1,553 జూనియర్ లైన్మెన్ పోస్టులు, 48 అసిస్టెంట్ ఇంజనీర్/ ఎలక్ట్రికల్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు.