Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థుల పోస్టు మెట్రిక్ స్కాలర్షిపుల రెన్యూవల్స్, కొత్తగా నమోదుకు గడువును ప్రభుత్వం పొడిగించింది. మార్చి 31వరకు అవకాశం ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి టి విజయకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ పాస్ పోర్టల్ ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.