Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ అర్వింద్‌కు పీయూసీ చైర్మెన్ జీవన్‌రెడ్డి సవాల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిజామాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..? అంటూ పీయూసీ చైర్మెన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి... బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు సవాల్ విసిరారు. ఆయన కళ్లుండి కూడా రాష్ట్రంలోని అభివృద్ధిని చూడలేక పోతున్నారని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాల యంలో జీవన్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... మంత్రి కేటీఆర్‌ను విమర్శించే స్థాయి అర్వింద్‌కు లేదన్నారు. ఆయన తండ్రి డీఎస్నుద్దేశించి కేటీఆర్ గౌరవంగా మాట్లాడితే... దాన్ని కూడా అర్వింద్ జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. వాస్తవాలను మరుగుపరిచి రాష్ట్ర ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.