Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రవీణ్ కుమార్‌పై ఆరోపణలు మానుకోవాలి: బహుజన్ సమాజ్ పార్టీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీకి బీఆర్ఎస్సే అసలైన బీ టీమ్ అని బహుజన సమాజ్ పార్టీ నేతలు డాక్టర్ వెంకటేష్ చౌహాన్, అరుణ క్వీన్ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఎస్పీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై విషం కక్కుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో తమ బలపడడం చూసి బీఆర్ఎస్ భయపడుతున్నదని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామోనన్న భయంతో ఆ పార్టీ నేతలు ఉన్నారని తెలి పారు. తాము కవిత మాదిరిగా లిక్కర్ స్కాం చేసి అరెస్టు కాకుండా లోపా యికారి ఒప్పందం చేసుకోలేదని విమర్శించారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎస్పీగా ఉన్న సమయంలో ఎన్ కౌంటర్లు చేశారనే ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. వేలాది మంది మావోయిస్టులను ఆయన జనజీవన స్రవంతిలో కలిపారనీ,గురుకులాల కార్యదర్శిగా లక్షలాది మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు.