Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఏకకాలంలో రుణమాఫీ చేసేందుకు, రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు కేంద్ర బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. పార్లమెంటులో రాష్ట్రపతి దౌపతి ముర్ము తన ప్రసంగలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిందని చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వేలో మాత్రం వ్యవసాయ రంగానికి క్రమంగా నిధులు తగ్గిపోతున్నట్టు పేర్కొనట్టు తెలిపింది.ఇదే అంశంపై ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యవసా య ఎగుమతులు రూ. 5 లక్షల కోట్లకు పెరుగుతాయని చెప్పినప్పటికీ వాస్తవంగా వ్యవసాయోత్పత్తుల ఎగుమతి, దిగుమతుల్లో 2022-23లో రూ. మూడు లక్షల కోట్ల లోటు ఉన్నట్టు ఆర్ధిక సర్వే పేర్కొన్న విషయాన్ని తెలిపారు. ఎమ్ఎస్పీ ద్వారా పెట్టిన పెట్టుబడికి మించి రైతులకు ఆదాయం వస్తున్నట్టు పేర్కొనడాన్ని తప్పుపట్టారు. అందులో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పలేదని విమర్శించారు. వ్యవసాయోత్పత్తులను రూ. 5 లక్షల కోట్ల మేర విదేశాల నుంచి దిగుమ తులు చేసుకుంటున్న క్రమంలో వ్యవసాయరంగం అభివృద్ధిలో ఉన్నదని చెప్పడం హాస్యాస్పదని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో ఎనిమిది శాతం కేటాయింపులు చేయడం ద్వారా వ్యవసాయ రంగాన్ని, హార్టికల్చర్ పంటలను అభివృద్ధి చేయడంతోపాటు రైతుల ప్రయోజనాలను కాపాడ టం జరుగుతుందని తెలిపారు. పంట నష్ట పరిహారాన్ని చెల్లించడం ద్వారా రైతుల ఆత్మహత్యలను నివారించే అవకాశం ఉంటుందని సూచించారు.