Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీఎల్ఏగా అదనపు బాధ్యతలు
- పలువురు కలెక్టర్ల బదిలీ
- ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ నవీన్ మిట్టల్ బదిలీ అయ్యారు. ఆయన్ను రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారి మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మిట్టల్‌కు సీసీఎల్ఏగా అదనపు బాధ్యతలను కూడా అప్పగిస్తు న్నట్టు జీవోలో పేర్కొన్నారు. ఆయనతో పాటు మరో 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ మరో జీవో జారీ చేశారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి (2010 బ్యాచ్)... మహిళా శిశుసంక్షేమశాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. రాజీవ్ గాంధీ హనుమంతు (2012)ను నిజామాబాద్ కలెక్టర్‌గా, సిక్తా పట్నాయక్ (2014)ను హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా రాహుల్ రాజ్ (2015), వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా నారాయణరెడ్డి (2015), మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్‌గా అమోరు కుమార్ (2013), కుమురంభీం ఆసిఫాబాద్ కలెక్టర్‌గా యాస్మిన్ బాషా (2015), మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా జి.రవి (2015), సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా ఎస్.వెంకటరావు (2015), రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఎస్.హరీశ్ (2015), మెదక్ కలెక్టర్‌గా రాజర్సి షా (2017), వనపర్తి కలెక్టర్‌గా తేజాస్ నండ్లాల్ పవార్ (2018)ను బదిలీ చేశారు. కరీంనగర్ కలెక్టర్ ఆర్వి కర్ణన్ (2012)కు జగిత్యాల కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కర్నాటి వరుణ్ రెడ్డి (2019)ని నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా బదలీ చేశారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కలెక్టర్ అమోరు కుమార్‌కు హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.