Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 వరకు రాతపరీక్షల నిర్వహణ : టీఎస్పీఎస్సీ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జూన్ ఐదు నుంచి 12వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ రాతపరీక్షలను నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ 11న ఆదివారం కావడంతో ఆరోజు పరీక్ష ఉండబోదని తెలిపారు. ఈ పరీక్షలు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటాయని వివరించారు. జనరల్ ఇంగ్లీష్ పేపర్ మినహా అన్ని పేపర్లకూ అభ్యర్థులు వారు ఎంచుకున్న భాషలో పరీక్ష రాసుకోవచ్చని సూచించారు. గతేడాది అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ రాతపరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, వారిలో 2,85,916 మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. వారిలో 25,150 మంది అభ్యర్థులు మెయిన్స్ రాతపరీక్షలకు అర్హత సాధించారు. హైకోర్టు ఆదేశాలతో సమాంతర విధానంతో రిజర్వేషన్లు చేపట్టామని పేర్కొన్నారు. మల్టీ జోన్, రిజర్వేషన్ల ప్రకారం 1:50 ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. ఇతర వివరాలకు www.tspsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. 503 పోస్టుల భర్తీకి తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ ఏప్రిల్ 26వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే.