Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభినందించిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ హైదరాబాద్లో ప్రపంచ సామర్థ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. 1,800 మంది ఉద్యోగులతో జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబరేటరీని ఏర్పాటు చేస్తున్నామని ఆ సంస్థ సీఈవో రిచర్డ్ సేనోర్ తెలిపారు. ఈ కేంద్రంలో తొలుత 800 మంది ఉద్యోగులు, ఆతర్వాత దశలవారీగా వీరి సంఖ్యను 1800కు పెంచుతామని వివరించారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన ప్రతినిధి బృందంతో కలిసి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావును కలిశారు. ఈ ప్రతిపాదన పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఫార్మాసిటీలో తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరారు.