Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్ శాంతకుమారి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం భవన సముదాయ ప్రారంభోత్సవం, ఫార్ములా ఈ-రేసింగ్ ఏర్పాట్లలో భద్రతకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈనెల 11న ఫార్ములా ఈ-రేసింగ్, 17న నూతన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారంనాడామె బీఆర్కే భవన్లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ అంజనీకుమార్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, ఎస్పీఎఫ్ డీజీ ఉమేష్షరాఫ్్, అడిషనల్ డీజీ సంజరుకుమార్ జైన్, ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ అనిల్‌కుమార్, ఈఎన్సీ గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో భద్రతాపరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫిబ్రవరి 11న జరిగే ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ సందర్భంగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వరకు, మింట్ కాంపౌండ్ నుంచి ఐ-మాక్స్ వరకు రోడ్లను ఫిబ్రవరి 5 వతేదీ నుంచి మూసివేయాలని నిర్ణయించారు. ఈ రూట్లలో ట్రాఫిక్‌ను అనుమతించరు. నూతన సచివాలయ ప్రారంభోత్సవంలో పోలీసు, రోడ్లు, భవనాలు, జీఏడీ, తెలంగాణ స్పెషల్ పోలీస్, ఐటీ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. భద్రత కోసం మూడు కంపెనీల తెలంగాణ స్పెషల్ పోలీస్, 300 మంది సిటీ పోలీసు అధికారులను నియమించాలని నిర్ణయించారు. సిటీ ట్రాఫిక్ విభాగం నుంచి 22 మంది అధికారులను కూడా భద్రతా ఏర్పాట్లలో భాగస్వాములను చేస్తారు. బ్యాగేజ్ స్కానర్లు, వెహికిల్ స్కానర్లు, బాడీ స్కానర్లు, ఇతర పరికరాలను సమకూర్చుకోవాలనీ, మొత్తం 28 ఎకరాల్లో 9.42 చ.అ. విస్తీర్ణంలో నిర్మించిన నూతన సచివాలయంలో 560 కార్లు, 900లకు పైగా ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కు సదుపాయం కల్పిస్తారు. సచివాలయం చుట్టూ ఆరు సెంట్రీ పోస్టులు, 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. సచివాలయంలోకి వచ్చి వెళ్లే సందర్శకులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇస్తారు. 34 మంది సిబ్బందితో రెండు ఫైర్ ఇంజన్లు, 6వ అంతస్తు మినహా అన్ని అంతస్తులకు సందర్శకులకు పరిమితమైన అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.