Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భాషాపండితుల సహాయనిరాకరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు బుధవారం నుంచి పాఠాలు చెప్పబోమంటూ పండిత, పీఈటీ జేఏసీ ప్రకటించింది. భాషాపండితులు సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఈ మేరకు జేఏసీ ప్రతినిధులు స్టీరింగ్ కమిటీ సభ్యులు సి జగదీశ్, ఎండీ అబ్దుల్లా, చక్రవర్తుల శ్రీనివాసులు, నర్సిములు, క్రాంతికృష్ణ, గౌరీ శంకర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ మొదలైందని తెలిపారు. కానీ పండితులు, పీఈటీల పదోన్నతులపై కోర్టు కేసు పేరుతో మొండిచేయి చూపిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఈ సమస్యపై దృష్టి సారించి సమస్య పరిష్కారానికి ఉన్న మార్గాలను అన్వేషించాలని సూచించారు. ప్రత్యేక ఆర్డినెన్స్ తేవాలనీ, కోర్టు తుది తీర్పునకు లోబడి పదోన్నతులు కల్పించడం ద్వారా పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి గ్రేడ్-2 భాషాపండితులకు పదోన్నతుల్లో న్యాయం చేయాలని తెలిపారు.