Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శుభాకాంక్షలు తెలిపిన సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) విజిలెన్స్ విభాగం ఎస్పీగా ఐపీఎస్ అధికారి డాక్టర్ సంగ్రామ్‌సింగ్ పాటిల్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బస్‌భవన్‌లోని తన ఛాంబర్లో మంగళవారంనాడాయన ఈ బాధ్యతలు చేపట్టారు. ములుగు ఎస్పీగా ఉన్న ఆయనను టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించింది. అనంతరం ఆయన మర్యాదపూర్వకంగా సంస్థ ఎమ్డీ వీసీ సజ్జనార్‌ను కలిశారు. ఈ సందర్భంగా సజ్జనార్ ఆయనకు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్థ అభివద్ధి కోసం మంచి ఐపీఎస్ అధికారిని టీఎస్ఆర్టీసీకి నియమించినం దుకు రాష్ట్ర ప్రభుత్వానికి కతజ్ఞతలు తెలిపారు. స్వయంగా డాక్టర్ అయిన సంగ్రామ్‌సింగ్ సేవలను తార్నాక ఆస్పత్రిలో సౌకర్యాల మెరుగుదల, సిబ్బంది సంక్షేమానికి వినియోగించుకుంటామని చెప్పారు. మహారాష్ట్రలోని పండరీపూర్‌కు చెందిన సంగ్రామ్‌సింగ్ పాటిల్ 2015 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తెలంగాణ కేడర్‌కు చెందిన ఆయన మొదట భద్రాచలం ఏఎస్పీగా పని చేశారు. నాలుగేండ్ల్లుగా ములుగు ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లాకు రెండేండ్లు ఇంచార్జీ ఎస్పీగా పనిచేశారు. స్వయంగా డాక్టర్ అయిన సంగ్రామ్‌సింగ్ ఏజెన్సీలోని ఆదివాసీలకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి స్వయంగా వైద్యం అందించేవారు. పోలీసింగ్‌లో చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ని అంత్రిక్ సేవా పతకం ద్వారా సత్కరించింది.