Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్బీఐ లేడీస్ క్లబ్ ఏర్పాటు
హైదరాబాద్ : పేద, బలహీన వర్గాలకు సాయాన్ని కొనసాగించడానికి ఎస్బీఐ లేడిస్ క్లబ్ ఫన్ అండ్ ఫుడ్ కార్నివల్ను ఏర్పాటు చేసింది. బంజారాహిల్స్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఎస్బీఐ లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ నుపూర్ జింగ్రాన్, హైదరాబాద్ సర్కిల్ సీజీఎం అమిత్ జింగ్రాన్ లాంచనంగా ప్రారంభించారు. ఇక్కడ 55 ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. అధికంగా ఇందులో మహిళలు ఏర్పాటు చేసినవే కావడం విశేషం. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులను సహాయ కార్యక్రమాలకు ఉపయోగించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఎస్బీఐ లేడిస్ క్లబ్ చేపట్టే ఈ తరహా కార్యక్రమాలకు తమ మద్దతు కొనసాగుతుందని అమిత్ జింగ్రాన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి లేడీస్ క్లబ్ ప్రతినిధులు సహా బ్యాంక్ ఉద్యోగులు వారి కుటుంబాలతో హాజరయ్యారు.