Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావుకు ట్రెసా విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కొత్త కలెక్టరేట్ల మాదిరిగా డివిజన్, మండల కేంద్రాల్లో రెవెన్యూ శాఖకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు వీలుగా బడ్జెట్లో నిధులు కేటాయించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్( ట్రెసా) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగ రవీందర్‌రెడ్డి, కె.గౌతమ్‌కుమార్, ఉపాధ్యక్షులు కె.నిరంజన్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో ఈ మేరకు వారు మంత్రి హరీశ్‌రావును కలిసి విజ్ఞప్తి చేశారు. కొత్త మండలాలు, డివిజన్ కేంద్రాల్లో శాశ్వత రెవెన్యూ భవనాలు నిర్మించాలని కోరారు. పాత రెవెన్యూ కార్యాలయాల మరమ్మతులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త మండలాలు, డివిజన్లు, కలెక్టరేట్లలో నూతన కేడర్ స్ట్రెంగ్త్ నిర్దారించి సిబ్బందిని నియమించాలన్నారు. తహసీల్, డివిజన్ కార్యాలయాల నిర్వహణకు రెగ్యులర్ బడ్జెట్లో భాగంగా నిధులు కేటాయించాలని ప్రతిపాదించారు. తహసీల్దార్లకు, ఆర్డీవోలకు ఏకరూప వాహనాల కొనుగోలుకు నిధులివ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు పే స్కేలు వర్తింపజేసి వారి సర్వీసును క్రమబద్దీకరించాలని కోరారు. ట్రెసా ప్రతిపాదించిన అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి హరీశ్‌రావు హామీనిచ్చారు.