Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
- కోఠి మహిళా కాలేజీ వద్ద సంతకాల సేకరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర బడ్జెట్ (2023-24)లో విద్యారంగానికి 24 శాతం, వైద్య రంగానికి 12 శాతం నిధులు కేటా యించాలని తెలంగాణ పౌర స్పందన వేదిక (టీపీఎస్వీ) రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీపీఎస్వీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని కోఠి మహిళా కాలేజీ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 1,054 మంది సంతకాలు చేయడంతో మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ విద్యావైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించకపోవడం వల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, విద్యాసంస్థలు మౌలిక వసతులకు నోచుకోలేక పోతున్నాయని చెప్పారు. దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందడం లేదన్నారు. తప్పనిసరి పరిస్థి తుల్లో గత్యంతరం లేక లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ప్రయి వేటు ఆస్పత్రులకు వెళ్తున్నారని విమ ర్శించారు. భరించలేని ఖర్చులతో అప్పులపాలై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్లో విద్యావైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యతని వ్వాలని కోరారు. ప్రభుత్వ వర్సిటీలకు గతేడాది బడ్జెట్‌కు అదనంగా 50 శాతం నిధులు పెంచాలని సూచిం చారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో పెరుగుతున్న జనాభా కనుగు ణంగా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ విద్యాసంస్థల సంఖ్యను పెంచి మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రజలకు నాణ్య మైన విద్యా వైద్యం అందించడం సాధ్యమౌతుందని వివ రించారు. టీపీఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఎం రాధేశ్యాం, రాష్ట్ర సలహాదారు ఎంఎకె దత్, రంగారెడ్డి జిల్లా నాయ కులు కావ్యారెడ్డి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి జి రాములు పాల్గొన్నారు.