Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత జర్నలిస్టుల ప్రాతినిధ్యంతోనే సామాజిక మార్పు : మీడియా అకాడమి చైర్మెన్ అల్లం నారాయణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మీడియా సంస్థల్లో దళిత జర్నలిస్టుల ప్రాతి నిధ్యంతోనే సామాజిక మార్పు సాధ్యమని మీడియా అకాడమి చైర్మెన్ అల్లం నారాయణ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో జనవరి 31,1920లో మూక్ నాయక్ పత్రిక ఏర్పడిందనీ, ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లోని హౌటల్ హరిత ప్లాజాలో ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్ట్ నెట్వర్క్ కన్వీ నర్ (ఐడీజేఎన్) మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో మొ దటి అంతర్జాతీయ దళిత్ మీడియా దినోత్సవం నిర్వ హించారు. అల్లం నారాయణ, ఉన్నత విద్యామం డలి చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రి, సీనియర్ పాత్రికే యులు కె.రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్ కృష్ణ, ఇఫ్లూ ప్రొఫెసర్ సంతోష్ హాజరై ప్రసంగించారు. అల్లం నారాయణ మాట్లాడుతూ.. మీడియా సంస్థల్లో దళి తుల ప్రాతి నిధ్యం తక్కువగా ఉందనీ, పత్రికారం గంలో దళిత జర్నలిస్టులు అత్యంత వివక్షను ఎదు ర్కొన్న సంద ర్భాలు ఉన్నాయని వివరించారు. అందు కు ఆక్స్ ఫామ్, న్యూస్ రూం రిపోర్టుల అధ్యయనాల నివేది కలు వెల్లడించిన అంశాలే నిదర్శన మని చెప్పారు. జాతీయవాదం పేరుతో దేశానికి పెను ముప్పు ముం చుకొస్తున్నదని అణగారివర్గాలు చైతన్య వంతమై ఎదుర్కొనేందుకు బీసీలు, దళితులు, మహి ళలు, ఆది వాసీలు, మైనార్టీలు సిద్ధం కావాలని పిలుపునిచ్చా రు. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. ప్రధాన స్ర వంతిలోని పత్రికల్లో దళిత జర్నలిస్టుల సంఖ్య చెప్పు కోదగినవిధంగా లేదనీ, ఆ వర్గాల సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. బుద్ధవనం స్పె షల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. మీడి యాలో గతంలో దళిత జర్నలిస్టులను వెతుకులాడు కునే పరిస్థితి ఉండేదనీ, తెలంగాణ ఏర్పాటు అనం తరం ఆ పరిస్థితి మారిందన్నారు. కానీ గుర్తింపులేని పత్రికలు, యూట్యూబ్ ఛానళ్లలో గుర్తింపులేని జర్నలి స్టులుగానే మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. ప్రస్తుతం ప్రధాన మీడియా సంస్థల్లో దళితుల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టు విశేషాల గురించి వీడియో చిత్రీకరణ ద్వారా ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఈమని శివనాగి రెడ్డి వివరించారు.