Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెడ్కో చైర్మెన్ వై సతీష్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్ల మెంటులో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో అప్పుల కుప్పగా ఉన్నదేతప్ప, అభివృద్ధి ఊసే లేదని టీఎస్రెడ్కో చైర్మెన్ వై సతీష్‌రెడ్డి అన్నారు. బడ్జెట్లో 34 శాతం అప్పులే ఉన్నాయనీ, 20 శాతం సొమ్ము వడ్డీల కిందే పోతున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్ల మెంట్ సాక్షిగా ఒప్పుకున్నారన్నారని చెప్పారు. దేశానికి ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకేం ఉంటుం దన్నారు. 2014 వరకు భారత దేశ అప్పులు రూ. 55 లక్షల కోట్లు ఉంటే, ప్రస్తుతం అది రూ.169 లక్షల కోట్లకు చేరిందన్నారు. మోడీ హయాంలో రూ.115 లక్షల కోట్లు అప్పులు చేశారని వివరించారు. తెచ్చిన అప్పులతో చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు.