Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లిలో ఘటన
నవతెలంగాణ-పెద్ద అడిశర్లపల్లి
బైకును కారు ఢకొట్టడంతో తల్లీకొడుకు మృతిచెందారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలోని చిలకమర్రి స్టేజి సమీపంలో బుధవారం జరిగింది. గుడిపల్లి ఎస్ఐ ఏ.రంజిత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సంతమవులూరు గ్రామానికి చెందిన గంజి ఎలమంద, వెంకాయమ్మ దంపతులు దేవరకొండలోని తాటికోల్ గ్రామంలో 20 ఏండ్ల నుంచి నివాసం ఉంటున్నారు. తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కొడుకు, కూతురు సంతానం. బుధవారం ఉదయం తల్లీకొడుకు స్వగ్రామానికి బైకుపై బయలుదేరారు. జడ్చర్ల- కోదాడ 167 జాతీయ రహదారిపై చిలకమర్రి స్టేజి సమీపంలో ఎదురుగా వస్తున్న కారు బైక్ను ఢకొట్టింది. బైకు పెట్రోల్ ట్యాంక్ పగిలి పూర్తిగా దగ్ధమైంది. తీవ్రంగా గాయపడిన గంజి వెంకాయమ్మ(35), గణేష్(19) అక్కడికక్కడే మృతిచెందారు. గణేశ్ దేవరకొండలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉంది.