Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బడ్జెట్‌పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కేంద్రంలోని బీజేపీ సర్కారు మరోసారి విస్మరించిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బడ్జెట్ వల్ల రాష్ట్ర ప్రజలకు ఉపయోగం లేకుండా పోయిందని విమర్శించారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం ఊసేలేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విభజన చట్టాన్ని ఆమోదించి పదేండ్లు అవుతున్నా ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. బడ్జెట్లో కూడా బీజేపీ రాజకీయం చేసిందని పేర్కొన్నారు. ఎన్నికలున్న రాష్ట్రాలకు వెసులుబాటు ఇచ్చిందనీ, ఇతర రాష్ట్రాలకు అన్యాయం చేసిందనీ, పన్ను మినహాయింపు సగటు జీవికి నిరాశపరిచిందని పేర్కొన్నారు.
దేశ రైతాంగాన్ని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను నిరుత్సాహపరిచేలా బడ్టెట్ ఉందని తెలిపారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ పెత్తందారులకి అనుకూల బడ్జెట్‌గా ఉందని తెలిపారు. ప్రధాన కార్యదర్శి నగేష్‌ముదిరాజ్ మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు లాభం చేసే పనిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారని విమర్శించారు.