Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఆరో తరగతితోపాటు ఏడు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి ఖాళీ సీట్ల భర్తీ కోసం ఆన్న్లైన్లో దరఖాస్తు గడు వును ఈనెల 15 వరకు ప్రభుత్వం పొడి గించింది. ఈ మేరకు మోడల్ స్కూళ్ల అద నపు సంచాలకులు ఉషారాణి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్య మంలో బోధన ఉంటుందని తెలిపారు. ఆరో తరగతిలో ఒక్కో పాఠశాలలో వంద సీట్లు అందుబాటులో ఉంటాయని వివరిం చారు. ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీ సీట్లు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఓసీలు రూ.200, ఎస్సీ,ఎస్టీ,బీసీ, వికలాం గులు, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు రూ.125 దరఖాస్తు ఫీజు చెల్లించాలని కోరారు. వివ రాలు www.tsmodelschools.com వెబ్సైట్ను సంప్రదించా లని సూచించారు. ఇప్పటి వరకు 25 వేల దరఖాస్తులొచ్చాయని వివరించారు.