Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టింది కేంద్ర బడ్జెట్టా..? లేక కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన పద్దా..? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూటిగా ప్రశ్నించారు. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీకి 2025 వరకూ పన్ను మినహాయింపును పొడిగించి నప్పుడు... తెలంగాణలోని నిమ్జ్, ఇతర సెజ్‌ల పరిస్థితేంటని ఆమె ఒక ప్రకటనలో ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ సందర్భంగా ప్రత్యేకించి కొన్ని రాష్ట్రాల వైపే ఎందుకు చూస్తున్నారని నిలదీశారు. కర్నాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు కేటాయించినందుకు సంతోషమే, కానీ తెలంగాణలోని కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు ఎందుకు కేటాయింపులు చేయలేదని ప్రశ్నించారు. భగీరథకు నిధులివ్వాలంటూ నిటి అయోగ్ చెప్పినా కేంద్రం పట్టించుకోలేదంటూ కవిత ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
పేదలకు ఏమీ లేదు :కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే
దేశంలో రాబోయే మూడు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దేశంలోని పేదలకు కానీ, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటానికి కానీ బడ్జెట్లో ఏమీ లేదు. ఉద్యోగాల విషయంలో ఉపాధి హామీ పథకం, ప్రభుత్వ ఖాళీల భర్తీకి ఎలాంటి చర్యలూ లేవు. పిండి, తృణధాన్యాలు, పాలు, వంట గ్యాస్ ధరల పెంపుతో మోడీ ప్రభుత్వం దేశాన్ని దోచుకున్నది.