Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రబడ్జెట్లో తెలంగాణ సమస్యల ఊసేత్తకపోవడం దుర్మార్గమని వైఎస్ఆర్టీపీ వైఎస్ షర్మిల విమర్శించారు. ఈసారి కూడా విభజన చట్టంలోని హామీలను పట్టించుకోలేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కుపరిశ్రమ, పసుపుబోర్డు, ములుగు గిరిజన యూనివర్సిటీ ప్రస్తావించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. 'అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు' అన్నట్టు మన సీఎం ఏనాడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడారా? ప్రధాని రాష్ట్రానికొస్తే ఎదురెళ్లి విభజన సమస్యలు అడిగారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నష్టం చేస్తున్నాయని విమర్శించారు.